ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజ కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అయితే.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా.. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. డిసెంబర్ నెలలో థియేటర్లు ఓపెన్ కానుండటంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికే మొగ్గు చూపింది చిత్ర బృందం. అయితే.. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే..చాలా ప్లాఫ్‌ల తర్వాత మెగా హీరో ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయ్యేకా తెలుస్తుంది.
previous post