telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తమిళ నటి చిత్ర మరణంపై వీడని అనుమానాలు…

తమిళ నటి చిత్ర అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా ఈమె మరణంపై అనుమానాలు వీడటం లేదు. పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ఆత్మహత్య అంటున్నా, ముఖంపై, ఒంటిపై గాయాలు అనేక ప్రశ్నలకు కారణమౌతున్నాయి. తమ అల్లుడే చంపాడని చిత్ర తల్లి ఆరోపిస్తోంది. తమిళ నటి చిత్ర మృతిపై అనుమానాలు వీడటం లేదు. చిత్ర భర్త హేమంతే కారణమని ఆమె తల్లి ఆరోపిస్తోంది. అతనే చిత్రను కొట్టి చంపేసి ఉంటాడని ఆమె అంటున్నారు. అందుకే, చిత్ర మృతదేహంపై చెంపదెబ్బల ఆనవాళ్లు ఉన్నాయని ఆమె చెప్తున్నారు. చిత్ర-హేమంత్ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారని చిత్ర తండ్రి చెప్తున్నారు. కొన్నినెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, తమ పెళ్లి గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాక ఈ ఏడాదిలో పెద్దలందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొన్నారని ఆయన చెప్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర ఆత్మహత్య పాల్పడడానికి గల కారణమేమింటో తెలియడం లేదని ఆయన విలపిస్తున్నారు. పాండియన్ స్టోర్స్  సీరియల్తో తమిళ ప్రేక్షకులకు చేరువైన తమిళ నటి చిత్ర గత బుధవారం అనుమానాస్పదంగా మరణించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆత్మహత్య అని చెప్తున్నప్పటికీ, ఆమె కుటుంబానికి, ఫ్యాన్స్ కి అనుమానాలు వీడటం లేదు. చూడాలి మరి ఈ కేసు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుంది అనేది.

Related posts