telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పెరిగిన బంగారం ధరలు…

Gold rates hike

ప్రయోఅంచని వణికించిన కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మాత్రం పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో, హైదరాబాద్ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరగడంతో రూ. 52,530 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 48,150 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 50,180కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరగడంతో రూ. 46,000 పలుకుతోంది. వెండి మాత్రం గత రెండు రోజులుగా స్థిరంగా రూ.66,800 వధే ఉంది.

Related posts