సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలన్నింటి పై కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. ఢిల్లీలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా మా చేతిలోల ఉందని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ఎల్‌ఆర్‌ఎస్ లోపాలపై ఉద్యమిస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. త్వరలో సీఎం కేసీఆర్ అవినీతి పై సాక్ష్యాల తో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు బండి సంజయ్. కాగా.. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నాలుగు సీట్ల నుంచి ఏకంగా 44 సీట్లకు ఎగబాకింది బీజేపీ పార్టీ. దీంతో టీఆర్‌ఎస్ పార్టీకి అసలైన పత్రిపక్షమని గ్రేటర్ ఫలితాల ద్వారా బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ విజయంతో.. ఆ పార్టీలో చేరికల సంఖ్య కూడా పెరగిపోయింది..
previous post
next post
వైసీపీలోకి తోట వచ్చినంత మాత్రాన ఆ కేసును వదలం: సుభాష్ చంద్రబోస్