రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అత్తాపూర్ లో మొక్కలు నాటిన బుల్లి తెర నటి శ్వేతాంజలి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడమే మనం ఇచ్చే గొప్ప సంపద అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ముందు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రదీప్; నటులు బిందు; కిరణ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరడం జరిగింది.
previous post
చరిత్రహీనుడు చంద్రబాబు: రోజా