telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం…

హరిద్వార్ దేవాలయాన్ని నవంబర్ 30 వరకు మూసివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని నేడే ప్రకటించింది. హరిద్వవార్ సరిహద్దులు మొత్తం మూసివేయాలని, గంగా స్నానానికి ఎవ్వరినీ రాష్ట్రంలోనికి రానివ్వద్దని తెలిపింది. ‘రెండు రోజులపాటు హరిద్వార్ హద్దులను మూసివేశారు. గంగాస్నానం చయాలనుకునే వారు ఎవ్వరూ కూడా ప్రయత్నించవద్దు. భక్తులు కూడా నగరంలోకి రాకూడదు. రాష్ట్రంలో కరోనా ఎద్దడి భారీగి ఉంది. ఈ కార్తీక పౌర్ణమికి భక్తులు ఎవ్వరూ కూడా హరిద్వార్‌కు రాకండి. ఇక్కడ గంగా స్నానం నిషేదించడం జరిగింద’ని సీనియర్ సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సెంతిల్ అబెదాయ్ కృష్ణరాజ్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కార్తీక పౌర్ణమి పండుగను, ఆ సమయంలో చేసే గంగా స్నానాలను బ్యాన్ చేసింది. ఆ తరవాతి కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతీ ఏడాది ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. కానీ ఈ ఏడాది కార్యక్రమాన్ని నిలిపివేశారు. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ సందర్భంగా వచ్చే భక్తులను హరిద్వార్‌లోని రాణించవద్దని, కరోనా పూర్తిగా కమ్ముకుని ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికి ఉత్తరాఖండ్‌లో 4,876 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related posts