ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా..రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పూర్తి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ లోనే గెలుపునకు కావలసిన మెజారిటీ సాధించి, విజయ ఢంకా మోగించారు.
అయితే.. ఇపుడు అందరి చూపు కవిత కేబినెట్ లో వస్తారా ? లేదా ? అనే ప్రశ్న టీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ మరియు ప్రజల్లోనూ మెదులుతున్నది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో గెలిచినా కవితను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. మంత్రి వర్గంలో గరిష్ట పరిమితి ఐన 17 మంది ఇప్పటికే ఉండటంతో ఎవరిని తప్పిస్తారనేది తెలియాల్సి ఉంది. సామాజిక సమీకరణలతో ఏర్పాటైన మంత్రి వర్గంలో ఏ వర్గం మంత్రిని తప్పించిన విమర్శలు ఎదురుకోవాల్సి ఉంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: చంద్రబాబు