గత ఏడాది డిసెంబర్‌లో “రూలర్”గా సందడి చేసిన బాలయ్య ఈ ఏడాది బోయపాటి దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో బాలకృష్ణ అఘోరాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య అసెంబ్లీలో బాలయ్య గుండుతో కనిపించారు. ఆయనని చూసిన అభిమానులు బోయపాటి సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ 106వ సినిమా కోసం ఇప్పటికే బోయపాటి రెండు సార్లు స్క్రిప్ట్ మార్చాడట. చివరకి అఘోరా పాత్ర గురించి వివరించడంతో ఆ పాత్రలో నటించేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర బృందం వారణాసి వెళ్ళి అక్కడ పలు లొకేషన్స్ సెర్చ్ చేశారట. ఎంపిక చేసిన లొకేషన్స్‌లో చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బాలకృష్ణ, బోయపాటి శీను ఇద్దరు సినిమాకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేస్తున్నారట. వచ్చిన లాభాలలో షేర్ తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రని పోషించనుండగా, ఈ చిత్రాన్ని 2021 దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
previous post
next post