ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళన క్రమంగా పొరుగు రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోయారు. శుక్రవారం సాయంత్రం ఏకంగా ఓ రైల్వే స్టేషన్ కే నిప్పులు పెట్టేశారు. రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. ముర్షీదాబాద్ జిల్లా బెల్డాంగ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గుంపులు, గంపులుగా బెల్డాంగ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. కర్రలు, ఇనుప కడ్డీలతో వారు చెలరేగిపోయారు. స్టేషన్ లో లూప్ లైన్ లో నిలిపి ఉంచిన రైలు అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఉన్న సామాన్లపై పెట్రోల్ పోసి, నిప్పు అంటించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. పైగా- అగ్నిగుండంలా మారిన అస్సాం రాష్ట్రానికి ఆనుకుని ఉండటంతో హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం పశ్చిమ బెంగాల్ కు పాకింది. ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారనే సమాచారాన్ని అందుకున్న వెంటనే రైల్వే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదర గొట్టాయి. ఈ సందర్భంగా వారు రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నేత అనురాధ ఫైర్