యాంకర్ అనసూయ టీవీ షోలతోపాటు సినీ పరిశ్రమలో కూడా ఈ మధ్య ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాగాజా అనసూయకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. ఆమెకు బిగ్ బాస్-4 రియాల్టీ షో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని చెబుతున్నారు. అయితే, భారీ ఆఫర్ ను కూడా అనసూయ నో చెప్పినట్టు తెలుస్తోంది.
వరుస సినీ అవకాశాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న తరుణంలో… అన్ని రోజులు బిగ్ బాస్ కు పరిమితం కావడం అనసూయకు ఇష్టం లేదట. దీనికి తోడు ఇంటికి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. భర్త, పిల్లలను విడిచి అన్ని రోజులు గడపడం కూడా కష్టమని భావించిన అనసూయ బిస్ బాస్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.
మీటూ ఆరోపణల వల్ల అవకాశాలు దూరం : తమన్నా