telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కబ్జ’ చేస్తానంటోన్న అండర్ వరల్డ్ డాన్‌…

upendra

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ‘A’, ‘ఉపేంద్ర’, ‘ఒకేమాట’, ‘రా’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర చేసిన పాత్ర ఏ స్థాయిలో పేలిందో అందరికీ తెలిసిందే. కన్నడలో వరసపెట్టి సినిమాలు చేస్తోన్న ఉపేంద్ర.. హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉపేంద్ర హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్ధమవుతున్నారు. ఓ భారీ చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమాకు ‘కబ్జ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘కబ్జ’ ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. పాత క్లాసిక్ బైక్ జావా మీద కూర్చొని సీరియస్‌గా చూస్తోన్న ఉపేంద్ర లుక్ అదుర్స్ అంతే. ఈ సినిమాలో ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్‌గా కనిపించనున్నారు. ఇది 80ల కాలంలో జరిగే న్యూ వర్షన్ అట.ఈ సినిమాకు ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 7 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Related posts