telugu navyamedia
సినిమా వార్తలు

జీవితంలో రాణించాలన్నా, సాధించాలన్నా చదువు చాలా ముఖ్యం : సుమన్

“ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావిత చేసేది , ప్రగతి పథంలో నడిపించేది నిస్సందేహంగా చదువే . చదువు వల్ల మానసిక వికాసం ఏర్పడుతుంది, విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు తద్వారా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు” అన్నారు నటుడు సుమన్ .

బ్రెయిన్ ఫీడ్ ఇంగ్లీష్ మాసపత్రిక 9వ జాతీయ సదస్సు ఏప్రిల్ 6, 7 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ , నోవాటెల్ లో జరిగింది . ఈ జాతీయ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాఠశాలల యజమానులు , ప్రతినిధులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

బ్రెయిన్ ఫీడ్ పత్రిక ప్రధాన సంపాదకుడు కాకాని బ్రహ్మం ఈ 9వ జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు . 7వ తేదీ నటుడు సుమన్ ఈ సదస్సులో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు .
ఈ సందర్భగా సుమన్ మాట్లాడుతూ – ” మనిషి మనుగడలో చదువు చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది . ఆ విషయం చిన్నప్పుడే నాకు తెలుసు . మా అమ్మ కేసరి చంద్ర చెన్నైలోని ఎతిరాజా మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేవారు . నా చిన్నప్పుడు తరచుగా అమ్మతో నేను ఆ కాలేజీకి వెళ్ళేవాడిని . చక్కగా చదువుకునే ఆడపిల్లలను చూపించి నువ్వు కూడా ఇలా చదువుకోవాలని అమ్మ చెప్పేది ఆ మాటలు నా లేత మనసులో బాగా నాటుకపోయాయి. అందుకే నేను బి ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను ” అని చెప్పారు.

“నిజానికి నాకు నటన పట్ల ఎలాంటి ఆసక్తి లేదు . అయితే నన్ను చూసిన రామన్న అనే తమిళ నిర్మాత హీరోగా నటించమని వత్తిడి చేశాడు . అమ్మ కూడా ప్రోత్సహించింది . అదే “నీచల్ కుళమ్ “. ఈ సినిమాలో నేను పోలీస్ అధికారిగా నటించాను . నటన లో ఎలాంటి శిక్షణ తీసుకోకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను . ఒకానొక సందర్భాల్లో ఇది మనకు అవసరమా ? అనుకున్నాను . ఆ రోజున రామన్న నాలో ఏమి చూసి ఎంపిక చేశాడో తెలియదు . ఆయన ఎంపిక చాలా కరెక్ట్ అని నా జీవితం రుజువు చేసింది .” అని చెప్పారు .

నా మొదటి సినిమా నీచల్ కుళం 1979లో విడుదలైంది . ఈ 43 సంవత్సరాల్లో తెలుగు, తమిళ,కన్నడ , మళయాళ రంగాల్లో 150 చిత్రాల్లో హీరోగా నటించాను . విల్లన్ గా , క్యారెక్టర్ నటుడుగా పది భాషల్లో మరో 450 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించాను . అన్నయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించాను . ఈ పాత్ర అందరికీ నచ్చింది . నటుడుగా నాకు కూడా ఎంతో సంతృప్తినిచ్చింది . శివుడు , శ్రీరామ పాత్రల్లో కూడా నటించాను . నటుడుగా నేను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నానే తృప్తి నాకుంది ” అని చెప్పారు సుమన్ 1980 నుంచి భగీరథ గారు జర్నలిస్టుగా నాకు పరిచయం .

ఆయన మిత్రులతో కలసి ‘ప్రియమైన శ్రీవారు ” చిత్రం నిర్మించారు . ఆ సినిమాలో నేను హీరోగా నటించాను . భగీరధ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించారు . నిజానికి నేను చెన్నై నుంచి మధ్యాన్నమే వచ్చాను . భగీరథ గారంటే నాకు ఎంతో గౌరవం . అందుకే అరగంట ఉంటానని చెప్పను . కానీ ఇక్కడకు వచ్చాక చెలిసింది , ఇది ఎంతో మంచి కార్యక్రమమో . ” అన్నారు .

“బ్రెయిన్ ఫీడ్ ఇంగ్లీష్ మాస పత్రిక ప్రధాన సంపాదకుడు కాకాని బ్రహ్మం గారు చాలా గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు . దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 9వ జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చారని తెలుసుకుని చాలా సంతోషపడ్డాను . ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు బ్రహ్మం గారికి ధన్యావాదాలు తెలియజేస్తున్నాను ” అని చెప్పారు.

“మాకు ఒక్కటే అమ్మాయి . మా అమ్మాయి చదివే స్కూల్ ఉపాధ్యాయులు కూడా వచ్చి ఈరోజు అవార్డులు స్వీకరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది . చదువు అంటే నాకు ఎంతో ఇష్టం . చదువుకునే బాలలన్నా , చదువు చెప్పే ఉపాధ్యాయులన్నా నాకు అమితమైన గౌరవం ” అని చెప్పారు సుమన్ .

“ఉక్రెయిన్ లో యుద్ధం , రష్యా లో నియంత , మయన్మార్ లో సైనిక తిరుగుబాటు, పాకిస్తాన్ లో అస్తవ్యస్త పాలన .. మనదేశంలో మాత్రం సుస్థిరమైన పాలన , ఎలాంటి సమస్యలు లేని నిశ్చింతమైన జీవితం . కాబట్టి ఎలాంటి చింతలు , చికాకులు లేవు కాబట్టి చదువుకోండి , మీ కలలను చదువు ద్వారా సాకారం చేసుకోండి ” అని సుమన్ ఉద్భోదించారు .
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకు వచ్చిన ఉపాధ్యాయులు , యజమానులకు సుమన్ అవార్డులను అందించారు.

ఈ సందర్భగా సుమన్ , కాకాని బ్రహ్మం మధ్య వున్నా సినిమా అనుబంధాన్ని జర్నలిస్ట్ భగీరథ గుర్తు చేశారు . ప్రియమైన శ్రీవారు సినిమా కు ప్రసాద్ రెడ్డి , అంజిరెడ్డి తోపాటు బ్రహ్మం కూడా నిర్మాతని , తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరునని చెప్పారు . సుమన్ కు మొదటి అడ్వాన్స్ ను బ్రహ్మం గారే సుమన్ కు అందించారని భగీరథ ఈ సందర్భగా గుర్తు చేశారు . అలా 26 సంవత్సరాల తరువాత బ్రహ్మం గారు ఏర్పాటు చేసిన బ్రెయిన్ ఫీడ్ 9వ జాతీయ సదస్సుకు సుమన్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుందని భగీరథ చెప్పారు.

సుమన్ ను కాకాని బ్రహ్మం ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు.ఒకనాటి తమ సినిమా హీరో సుమన్ పాల్గొనడం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చి ఉత్సాహాన్ని , ఊపును , సరికొత్త శోభను తెచ్చిందని బ్రెయిన్ ఫీడ్ ప్రధాన సంపాదకుడు బ్రహ్మం ఆనందం వ్యక్తం చేశారు .

 

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి .వి కాత్మని ,సన్ షైన్ ఆసుపత్రి ఎండి డాక్టర్ గురువా రెడ్డి ,అహికాన్ గ్రూప్ అఫ్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ .కె పాండే , జూబిలీ హిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి టి . హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ కులభూషణ్ శర్మ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . కాకాని హరీష్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Related posts