telugu navyamedia
సినిమా వార్తలు

నవంబర్ 26న ‘కార్పొరేటర్’‌గా రాబోతున్న ష‌క‌ల‌క శంక‌ర్ ..

స్టార్ కమెడియన్ షకలక శంకర్ న‌టిస్తున్న సినిమా ‘కార్పొరేటర్. ఆయన ప్రధాన పాత్రలో కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కార్పొరేటర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాతో సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 200 థియేటర్స్ లో నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.

ఇందులో 5 పాటలు – 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ ‘కార్పొరేటర్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.

Related posts