గాల్వాన్ వ్యాలీ హీరో ,దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు.
గతేడాది చైనా సరిహద్దులోని లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) జరిపిన దారుణమైన దాడిని ప్రతిఘటిస్తూ అబ్జర్వేషన్ పాయింట్‌లో ప్రాణత్యాగం చేశారు. కల్నల్ సంతోష్‌బాబుకు ఈరోజు మరణానంతరం మహావీర చక్ర ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దేశానికి సంతోష్ బాబు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
సంతోశ్‌బాబు సేవలను స్మరిస్తూ మరణానంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
మహా వీర్ చక్ర అనేది యుద్ధ సమయాల్లో భూమిపై, సముద్రంలో లేదా గాలిలో శత్రువుల సమక్షంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ప్రదానం చేస్తారు.మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’ రెండో అత్యున్నత పురస్కారం.
‘ఆపరేషన్ స్నో లెపార్డ్’ సమయంలో గాల్వాన్ లోయలో అబ్జర్వేషన్ పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు కల్నల్ సంతోష్ బాబు చైనా సైన్యం దాడిని ప్రతిఘటించారని ప్రభుత్వం తన అధికారిక ఉల్లేఖనంలో పేర్కొంది.
ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: అమిత్ షా