telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా అప్డేట్‌: ఈరోజు ఎన్నంటే…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.92 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 226 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయం లో 351 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,621 కు చేరుకోగా… 2,87,117 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1584 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.11 శాతంగా ఉంటే.. భారత్‌లో 96.7 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 3,920 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 2,322 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31,647 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు.

Related posts