telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున

Nagarjuna

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో స్పందించారు. నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం అని అభివర్ణించారు. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ఇందుకు ట్యాగ్ చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరుకానున్నారు.

Related posts