telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భారత్ లో పెరుగుతున్న ఫేక్ కరెన్సీ…

Money

భారత్ లో ఫేక్ కరెన్సీ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెబుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంటోంది. మరీ ముఖ్యంగా దొంగ రూ.500 నోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో వెల్లడైంది. 2020-21లో వార్షిక ప్రాతిపదికన చూస్తే.. రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ నోట్లు 31.4 శాతం మేర పెరిగినట్లు గుర్తించింది. అయితే ఇతర కరెన్సీ నోట్లలో నకిలీ నోట్లు తగ్గాయని ఆర్బీఐ పేర్కొంది. 2020-21లో ఆర్‌బీఐ 39,453 ఫేక్ రూ.500 నోట్లను గుర్తించింది. అయితే చూడాలి మరి దీనిని అధికారులు ఎలా అడ్డుకుంటారు అనేది.

Related posts