telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ రేప్ కేసు : మైనర్ల నాలుగో రోజు పోలీసు కస్టడీ ముగిసింది

జూబ్లీహిల్స్‌లో అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదుగురు మైనర్లకు ఇవాళ నాలుగో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగో రోజు కస్టడీలో తీసుకున్న పోలీసులు నిందితులను దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 12 గంటలకు జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సాయంత్రం విచారణ ముగియగానే మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు.

ఓ కార్పొరేటర్ కుమారుడే మొదట లైంగిక దాడికి పాల్పడినట్లు నిన్న సీన్ రీకన్​స్ట్రక్షన్ సందర్భంగా గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా మైనర్లను ప్రశ్నించిన సమయంలో అత్యాచారానికి సంబంధించి ఒకరిపై, ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టడంతోనే అత్యాచారం చేసినట్లు మైనర్లు చెప్పగా…. ఎమ్మెల్యే కుమారుడే మొదట అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత మిగతా వాళ్లం అత్యాచారం చేసినట్లు సాదుద్దీన్ పోలీసులకు వివరించారు.

సీన్ రీ కన్​స్ట్రక్షన్ సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా మైనర్లను ప్రశ్నించి కొంత సమాచారం సేకరించారు. ఈ కేసులో ప్ర‌ధాన‌నిందితుడు సాదుద్దీన్​కు కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయ‌మూర్తి ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Related posts