తెలంగాణాలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు దైర్యం నింపిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జనసైనికులనుద్దేశించి జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టన పవన్ తెలంగాణ గడ్డ తనకు ధైర్యం ఇచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్నారు.
“రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు. 2009లో రాజకీయాలు నా అధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు. సామజిక మార్పుకోసం పోరాడతాం..ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసేది లేదని చెప్పారు పవన్. దెబ్బలు కొట్టే కొద్దీ మరింత ఎదుగుతామన్నారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాననని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తాను తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని అన్నారు. తెలంగాణలోని యువతకు అవకాశాలు కల్పించాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తులు అసెంబ్లీకి వెళ్తే చూడాలని ఉందని, తప్పకుండా జనసేన ఆ కలను నిజం చేసి చూపిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తనకు, డబ్బు పదవులు అవసరం లేదని, సమాజిక మార్పు కోరుకునే వ్యక్తిని అని పవన్ తెలిపారు. ప్రజల నుంచి దండుకునే డబ్బు తనకు అవసరం లేదని, అలా చేస్తే పాపం అవుతుందని, ప్రజలు ఏమి ఇవ్వాలి అనుకున్నా వాటిని సినిమా ద్వారా సంపాదించుకుంటానని అన్నారు.
“నేను అన్ని కులాలను గౌరవించేవాన్ని. రెచ్చగొట్టేవాన్ని కాదు. మన హక్కులు ఎదుటివాళ్ల హక్కులకు భంగం కలిగించనంతవరకే. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించింది. భాషలను గౌరవించాలన్న సంప్రదాయం మనది. “నారాజు గాకురా మా అన్నయ” అని రాశానంటే అది తెలంగాణ కోసమే. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదాన్ని పెంపొందించుకోవాలి. పర్యవరణాన్ని పరిరక్షించే బలమైన అభివృద్ధి జరగాలి. ఇవన్నీ.. ఒక్క రోజులో జరిగేవి కాదు. బావితరాలకు బలమైన సమాజాన్ని ఇచ్చేందుకే ఇలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నానని అన్నారు.
తెలంగాణ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే.. పదిహేడేళ్ల కుర్రాడు లో సమస్యపై పోరాడతారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్య కోసం తనవద్దకు వచ్చిన తీరు ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. అంత గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమని అన్నారు.
మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం…