దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్‌రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. ఒక మనిషిని ఎన్ని విధాల వేధించారో అంతలా తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ చారిత్రక తీర్పు పాలకులకు కనువిప్పు కావాలన్నారు. ఈ సౌండ్ వినిపియాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాని రఘునందన్ రావు పేర్కొన్నారు. దుబ్బాక విజయానికి సహకరించిన కార్యకర్తలకు, నేతలకు ఈ సందర్భంగా కృతజ్ఙతలు చెప్పారు రఘునందన్ రావు. కాగా..దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 61302 ఓట్లు, కాంగ్రెస్ 21819 ఓట్లు, బీజేపీ 62,772 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాంక్స్‌ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం రఘనందన్‌రావునే వరించింది.
previous post