telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో కుండపోత వర్షం..

హైదరాబాద్​ నగరంలో మళ్లీ వర్షం కుండపోత వర్షం పడుతోంది ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీనగర్, హయత్​నగర్, వనస్థలిపురం, చైతన్యపురి, దిల్​సుఖ్​నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బేగంబజార్, సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Hyderabad rain

నగరంలో ఒక్కసారిగా పడిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇవాళ మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే 040 2111 1111 నంబరులో సంప్రదించాలని జీహెచ్ఎంసీ సూచించింది.

ఈరోజు ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉటుందని చెప్పారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటలలో ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

Heavy rain alert for Hyderabad till Oct 15ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 4- 5 రోజులలో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు వెల్ల‌డించారు

Related posts