telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోడెల ఆత్మహత్యపై స్పందించిన కుమార్తె విజయలక్ష్మి

case filed-kodela-daughter

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన కుమార్తె విజయలక్ష్మి స్పందించారు. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గాను తాను రెడీ అవుతున్నాను. ఆ సమయంలో నాన్నటిఫిన్‌ చేశాక కింది ఫ్లోర్‌ నుండి ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లారని, అరగంటకు పైగా కిందకు రాకపోవడంతో పైకి వెళ్లి చూశామని ఆమె చెప్పారు. తాను పైకి వెళ్లి చూసేసరికి నాన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్టుగా విజయలక్ష్మి పోలీసులకు వివరించారు.

డ్రైవర్, గన్‌మ్యాన్ సాయంతో ఆయనను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.నాన్నపై నమోదైన కేసులు చోటు చేసుకొంటున్న అవమానాలతో నాన్న తీవ్ర అవమానాలకు గురైనట్టుగా విజయలక్ష్మి పోలీసులకు వివరించారు. తన తండ్రి ఎలాంటి సూసైడ్‌ నోట్‌ రాయలేదని కోడెల కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు.

Related posts