బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లు, బస్తీ దవాఖానాల పనితీరు వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
జీహెచ్‌ఎంసి పరిధిలో డివిజన్‌కు 2 చొప్పున బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో హైదరాబాద్‌లో 168 బస్తీదవాఖానాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు తెలిపపారు. రెండు రోజుల్లో మరో 10బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్యసేవలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.
తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు