telugu navyamedia
రాజకీయ వార్తలు

ముంబైకు మారిన కర్ణాటక రాజకీయం.. సోఫిటెల్ హోటల్ లో ఎమ్మెల్యేలు

mubai sofitel hotel

కర్ణాటక రాజకీయం గంటగంటకు కొత్త మలుపు తిరుగుతోంది. నేడు అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో బస చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నేడు హోటల్ బయట వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు హోటల్‌లో బస చేయడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రాలను ఎక్కి, సూట్‌కేసులు, బ్యానర్లు, మాస్క్‌లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతుందంటూ బీజేపీపై మండిపడ్డారు.

దీంతో పోలీసులు సోఫిటెల్ హోటల్ వద్దకు వచ్చి ఆందోళనకారులను వ్యాన్లలో తరలించారు. హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు బీజేపీ నేత, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుమారస్వామి రాజీనామాను ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Related posts