తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నియమించినందుకు కేకే, సురేశ్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం శాసనసభలో టీఆర్‌ఎస్‌కు ఉన్న బలాబలాలతో ఈ రెండు స్థానాలను ఆ పార్టీ సునాయాసంగా కైవసం చేసుకోనుంది.
పవన్ కల్యాణ్‌కు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు ..