పాకిస్థాన్ ను పక్కన పెట్టి.. పొరుగు దేశాల అధినేతలందరికీ ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పొరుగు దేశాలే ప్రథమం అనే పాలసీలో భాగంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ అధినేతలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం గ్రీటింగ్స్ చెప్పలేదు.
గత ఏడాదిన్నర కాలంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సైనికులను ఉగ్రవాదులు చంపిన తర్వాత భారత్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏకంగా పాక్ భూభాగంపైనే దాడి చేసి, బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అనంతరం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత… అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. ఆ దేశానికి ఇతర దేశాల నుంచి మద్దతు రాకపోవడంతో చివరకు ఏకాకిగా మిగిలిపోయింది.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే షర్మిల వివాదం