telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని పోలీసులే ఇచ్చారు: బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారనిటీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు సార్లు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి సంబంధించిన స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన అందరు నేతల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. తమకు పోలీసులపై నమ్మకం పోయిందని చెప్పారు. తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు.

Related posts