అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ నేపథ్యంలో రాముడి గురించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. శ్రీరాముడు ఉత్తమ మానవీయ విలువలు కలిగిన వాడని తెలిపారు. రాముడంటే మానవత్వమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మానవుల మనసు లోతుల్లో ఉన్న మానవత్వానికి శ్రీరాముడి మనవీయ విలువలే కారణమని రాహుల్ పేర్కొన్నారు. రాముడంటే ప్రేమ. ఆయనకు ప్రేమించడమే తప్ప, అసహ్యించుకోవడం తెలియదు. రాముడంటే అప్యాయత. ఆయనకు జాలి చూపడమే తప్ప హింసించడం తెలియదు. రాముడంటే న్యాయం. ఆయన అన్యాయాన్ని ఏమాత్రం సహించడు అని రాహుల్ ట్వీట్ చేశారు.
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు వెనుక చంద్రబాబు హస్తం: మంత్రి పెద్దిరెడ్డి