వికారాబాద్ జిల్లాలోని పరిగి మండల రెవెన్యూ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ వాజేశ్ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. రైతు భూమి పట్టా చేయడానికి వాజేశ్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో మాటు వేసిన ఏసీబీ సిబ్బంది రైతు నుంచి వాజేశ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని చెప్పారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు వెల్లడించారు.