పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టాలివుడ్ హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదైంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధార్థ్‌తో పాటు గాయకుడు టీఎం కృష్ణ, సీనియర్ నేత తిరుమవలవన్ మద్దతు పలికారు.
అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. సిద్ధార్థతో పాటు మొత్తం 600 మంది నిరసనకారులపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.