telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

వారికి రక్షణ కల్పిస్తాం అని చెప్పిన ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్…

ప్రేమ మోజులో పడి యువత పెడ దోవ పడిపోతుందని ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నిన్న రాజమహేంద్రవరంలో ప్రభుత్వ కళాశాల తరగతి గదిలో ఇంటర్ చదువుతు మైనర్ విధ్యార్ధులు  వివాహం చేసుకున్న సంఘటన చూసి షాక్ అయ్యానని పెళ్లి అంటే బొమ్మలాట కాదని ఆమె తెలిపారు. మైనర్ బాలిక, బాలుడు చేసిన ఘటన తప్పైనప్ప టికి బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పిస్తామని అన్నారు. బాలిక తో పాటు బాలికను ఇంటి నుంచి వెలివేసిన తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో  దిశ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు అనంతరం పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై చోటుచేసుకుంటున్న పరిణామాలు రక్షణ ఇబ్బందులపై… వార్డ్ గ్రామ మండల పట్టణ స్థాయి వరకు పరిస్థితులను పరిశీలించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించి అన్ని సంఘాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించనునున్నట్లు  వాసిరెడ్డి పద్మావతి తెలిపారు. 

Related posts