telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో 3 కోట్ల మంది ఓటర్లు… జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 15.01.21 తేదీ నాటికి మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరిలో 150, 02,227 మంది మహిళా ఓటర్లు ఉండగా… 1,51, 61, 714 మంది పురుషులు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 1628 మంది ఇతరులు ఇన్నట్లు ప్రకటించింది. తాజా సవరణలో 2, 82, 497 మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు.. 1,72,255 మంది ఓటర్లను తొలగించినట్లు వెల్లడించింది ఎన్నికల సంఘం. కొత్తగా 2, 82, 497 మంది ఓటు నమోదు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఇక సర్వీస్‌ ఓటర్లుగా 13, 703 మంది నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు ఏపీలో 15.01.21 తేదీ నాటికి 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు జాబితా విడుదల చేసారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్. ఇందులో మహిళ ఓటర్ల సంఖ్య 2 కోట్ల 4 లక్షల 71 వేల 506 కాగా… పురుష ఓటర్ల సంఖ్య 1 కోటి 99 లక్షల 66 వేల 737 గా ఉంది. సర్వీసు ఓటర్లు 66 వేల 844 ఉండగా… థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 గా ఉన్నట్లు తెలిపారు ఈసీ. కొత్తగా 4 లక్షల 25 వేల 860 మంది ఓటర్లు 2021 జనవరి నాటికి పెరిగారని పేర్కొన్నారు ఈసీ.

Related posts