telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం

digital online classes

కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో ఇప్పటివరకు స్కూళ్ళు తెరుచుకోలేదు. కరోనా ప్రభావం రోజురోజు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈరోజు ఆన్ లైన్ క్లాసులు ప్రారాంభించింది.

విద్యార్థుల కోసం దూరదర్శన్ ఛానల్, టీ-శాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులను ప్రభుత్వం ప్రారంభించింది. మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించనున్నారు. ఒక్కో క్లాసు సమయం గరిష్ఠంగా అరగంట ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నారు.

Related posts