telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నీ స్పీడ్‌ కాంగ్రెస్‌ లో చెల్లదు ..రేవంత్‌ కు వీహెచ్‌ చురకలు

hanmanth rao congress

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హెచ్‌.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. రేవంత్‌ స్పీడు ప్రాంతీయ పార్టీల్లో చెల్లుతుందిగాని, కాంగ్రెస్‌ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ పార్టీల్లో చెల్లదని అన్నారు. ఆయన స్పీడ్‌ తగ్గించుకోవాలని చురకంటించారు.

యురేనియం విషయంలో కొందరికి ఏబీసీడీలు కూడా తెలియవని ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులని ఉద్దేశించి చేసిన విమర్శలపై మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థి విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమకుమార్‌రెడ్డి మూడు సార్లు గెలిచిన విషయాన్ని మర్చిపోరాదని సూచించారు. రేవంత్‌ వ్యాఖ్యల వల్ల నల్గొండ జిల్లా నేతలంతా ఏకమయ్యారని గుర్తుచేశారు. నువ్వు చాలా జూనియర్‌.. నీ స్థాయికి అంత స్పీడ్‌ పనికి రాదు అంటూ రేవంత్‌ కు హితవు పలికారు.

Related posts