telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు…

corona vaccine covid-19

ప్రస్తుత ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.  ఇక కేంద్రం కూడా రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నది.  కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వ్యాక్సిన్ ను ఎలా నిల్వ ఉంచాలి, తదితర విషయాలపై ఇప్పటికే తర్ఫీదు ఇచ్చారు.  కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట వైద్యసిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.  అయితే, అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చని అంటున్నారు.  వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఎవరికైతే అవసరమో వారికే మొదట వ్యాక్సిన్ ను అందించే అవకాశం ఉంది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.  అన్ని వ్యాక్సిన్ ల మాదిరిగానే ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు జ్వరం, నొప్పి వంటివి కలగడం షరా మామూలే.  వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అరగంట పాటు ఆరోగ్యకేంద్రంలో వెయిట్ చేయాల్సి ఉంటుంది.  ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది తెలుసుకొని వెళ్లడం ఉత్తమం.  వ్యాక్సిన్ కావాల్సిన వ్యక్తులు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా బ్యాంక్ పాస్ బుక్ వంటి వాటితో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఎక్కడ వ్యాక్సిన్ వేస్తారు అనే విషయాన్ని మెసేజ్ రూపంలో తెలియజేస్తారు.

Related posts