కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ప్రభుత్వం ఢిల్లీలో క్వార్టర్ కేటాయించింది. కానీ అందులో తిష్టవేసి ఉన్న మాజీలు ఖాళీ చేయక పోవడంతో ఢిల్లీలోని ఆంధ్రా భవన్ నుంచే ఆయన విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కిషన్ రెడ్డికి తుగ్లక్ క్రెస్కెంట్ రోడ్డులో భవనాన్ని కేటాయించారు. ప్రస్తుతం అందులో మాజీ మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. వాస్తవానికి జయంత్ సిన్హాకు బీజేపీ పాత ప్రధాన కార్యాయం ఎదురుగా ఉన్న బంగ్లాను కేటాయించారు. అందులో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్‌సింగ్ ఉంటున్నారు. సింగ్ తన భవనం ఖాళీ చేయక పోవడంతో జయంత్ సిన్హా కూడా తానుంటున్న ఇల్లు ఖాళీ చేయడం లేదు.
దీంతో కిషన్‌రెడ్డికి అధికారిక నివాసం కేటాయించినా అందులోకి వెళ్లే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి 16వ లోక్‌సభ మే 25 నాటికి రద్దయింది. నిబంధనల ప్రకారం జూన్ 25 నాటికి ఎంపీలంతా వారి అధికారిక భవనాలు ఖాళీ చేయాలి. కానీ నాలుగు నెలలు కావస్తున్నా మాజీలు ఇళ్లు ఖాళీ చేయడం లేదు. దీంతో కిషన్ రెడ్డి ఆంధ్రా భవన్ నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి