సాగు నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్న పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మెగా కుటుంబం అండగా నిలిచింది. తమ వంతుగా రూ. 35 లక్షల విరాళం చెక్కును అందించారు. వరుణ్ తేజ్ రూ. పది లక్షలు.. సాయి ధరమ్ తేజ్ రూ. పది లక్షలు, నిహారిక రూ. ఐదు లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ. ఐదు లక్షలు ఇచ్చారు. ఇతర కుటుంబసభ్యులు మరో రూ. పదిహేను లక్షలు ఇచ్చారు. మొత్తంగా రూ. 35 లక్షలను జనసేనకు విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోం.కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటారు తప్ప… రాజకీయాల గురించి నాతో చర్చించరని అన్నారు.
జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి తెలుసుకొని కదిలిపోయారు. వారి బిడ్డల భవిష్యత్తుకు ఎంతోకొంత అండగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి ఆర్ధిక సాయం అందించారు.
కథానాయకులు వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు అందించారు. వీళ్ళు రాజకీయంగా తటస్థంగా ఉంటారు. రైతులు కష్టాలకు చలించిపోయారు. వీరిలో సేవా దృక్పథం ఉంది.
ఈ మధ్య ఒక చిన్న పాప తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును తీసుకొచ్చి నాకు ఇచ్చింది.ఆ చిన్నారి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ముందకు వచ్చి రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
గత కొంతకాలంగా పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలను ఇస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు సాయం చేశారు. త్వరలో మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.
సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, నాగబాబు గారు, మాధవి గారు, డాక్టర్ రాజు గారు వీరంతా కౌలు రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. – JanaSena Chief Sri @PawanKalyan@IamSaiDharamTej @IAmVarunTej @IamNiharikaK @NagaBabuOffl pic.twitter.com/upFSfSYL47
— JanaSena Party (@JanaSenaParty) June 13, 2022
బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్