telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైద్య పరికరాలపై కస్టమ్స్‌ టాక్స్‌ రద్దుచేయాలి: మంత్రి ఈటల

Etala Rajender

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై కస్టమ్స్‌, టాక్స్‌ రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్నికోరారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై పన్నులు ఎత్తివేయాలని అన్నారు.

వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఈసీఐఎల్‌, డీఆర్‌డివో లాంటి సంస్థల్లో తయారుచేసి రాష్ట్రాలంకు అందజేయాలన్నారు.అలాగే పీపీఈకిట్స్‌, టెస్టింగ్‌కిట్స్‌ సాధ్యమైనంత త్వరగా తెలంగాణకు అందజేయాలని కోరారు. వైద్యపరికాలు,కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్‌మార్కెట్‌చేయకుండా నియంత్రించాలని, వాటిని కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ర్టాలకు అందించాలని మంత్రి సూచించారు.

Related posts