telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు

హైదరాబాద్‌ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ట్రాఫిక్‌. ఉదయం మొదలుకుంటే.. అర్థరాత్రి వరకూ వాహనాలతో రోడ్లన్ని నిండిపోతాయి. వాహనాల రద్దీ కారణంగా కొంత మంది వాహనదారులు అడ్డదిడ్డంగా రోడ్లను దాటేస్తుంటారు. అంతేకాదు… చాలా మంది హెల్మెట్‌ ధరించకుండానే స్వీడ్‌గా వెళతారు. దీంతో ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వాహనదారులకు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. తాజాగా సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. హెల్మెట్‌ లేకుండా టూవీలర్‌ నడిపితే ఇక లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.. మోటారు వేహికిల్‌ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 206(4) ప్రకారం రెండవ సారి హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే లైసన్స్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారు.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడంతోనే ప్రాణాలు కోల్పోయారని, టూవీలర్‌ పై వెనకాల కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నారు.

Related posts