telugu navyamedia
సినిమా వార్తలు

న్యూ ఇయ‌ర్‌కు ‘భీమ్లానాయక్’​ నుంచి స్పెష‌ల్‌ ​ సర్​ప్రైజ్.

ప‌వ‌ర్ స్టార్ పవన్​కల్యాణ్, రానా హీరోలుగా న‌టించిన సినిమా ”భీమ్లానాయక్’. మలయాళ హిట్​ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి రీమేక్​గా ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ పోస్టర్స్..: Bheemla  Nayak Posters. | Bheemla Nayak movie Posters trending in social media | TV9  Telugu

ఈ మూవీలో పవన్ మరోమారు పోలీస్ రోల్ చేస్తుండ‌గా.. రానా మరో కీలక రోల్ పోషిస్తున్నారు. ఇందులో నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పొస్ట‌ర్స్‌, సాంగ్స్ ఫ్యాన్స్‌కు వీప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు కోసం తాజాగా న్యూ ఇయ‌ర్ పుర‌స్క‌రించుకుని స్పెష‌ల్‌ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్‌. డిసెంబర్ 31న సాయంత్రం 7.02 గంటలకు ‘లాలా.. భీమ్లా డీజే సాంగ్’​ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Adavi Thalli Maata' : New song from Pawan Kalyan's 'Bheemla Nayak' hits the  right notes | Deccan Herald

సినిమాలోని లాలా భీమ్లా నాయక్‌ పాట ఎంత హిట్‌ అయిందో చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ పాటకు తమన్‌ కొత్త వెర్షన్‌ను తీసుకు వస్తున్నాడు.

Image

ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌గా తమన్ సంగీతమందిస్తున్నారు..సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సంక్రాంతి సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్‌, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాల కోసం విడుదల తేదిని వాయిదా వేసేందుకు పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోగా పోస్ట్‌పోన్‌ అయింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుద‌ల కానుంది.

Related posts