telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొండపల్లిలో పరిస్థితి ఉద్రిక్తం..

నగరపాలక పీఠంకోసం నువ్వా? నేనా?
వార్డుసభ్యులతో కలిసొచ్చిన ఎంపీ కేసినేని నాని
కార్యాలయం బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు
కార్యాలంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం
పోలీసులకు, వైఎస్ఆర్ శ్రేణులకు వాగ్వాదం

కృష్ణాజిల్లా కొండపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోరాహోరీగా సాగిన కొండపల్లి నగరపాలకసంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు తలపడ్డాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో తెలుగుదేశంపార్టీ నగరపాలకసంస్థ ఛైర్ పర్సన్ పదవిని చేజిక్కించుకోడాకి ప్రయత్నించింది. వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం తొలిరోజు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిన్నటి నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ్టికి చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండపల్లిలో వార్డు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి టీడీపీకి 16, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని కౌన్సిల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వైకాపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

నిన్నటి ఘటనలను దృష్టిలోపెట్టు్కున్న పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పురపాలక సంఘం కార్యాలయ ప్రాంతంలో దాదాపు 400 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కార్యాలయంవద్దకు చొచ్చుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నాలుచేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాలనడువ వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Related posts