telugu navyamedia
సినిమా వార్తలు

తీవ్ర మనస్తాపంతో “మా “కు నాగబాబు రాజీనామా..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు111 ఓట్ల మెజార్టీ తో విజయంసాధించారు . ఈ వార్త విన్న నాగబాబును తీవ్ర మనస్తాపానికి గురై “మా ” అసోసియేషన్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు . 

ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోడం నాగబాబు ఎందుకు జీర్ణించుకోలేకపోయాడు ? “మా ” ప్రాధమిక సభ్యత్వానికి కూడా అందుకే రాజీనామా చేశారడు ?మంచు విష్ణును నిన్నటి వరకు “మా ‘అధ్యక్షుడిగా వున్న నరేష్ సపోర్ట్ చేయడమే కాక ప్రత్యర్థులపై పోరాటానికి దిగాడు . మంచు విష్ణు గెలుపు కోసం రాత్రి పగలు శ్రమించాడు .

ప్రకాష్ రాజ్ గెలుపు కోసం మెగా బ్రదర్ నాగబాబు ఎంతో శ్రమించాడు . విష్ణు కు వున్న మైనస్ పాయింట్లు , ప్రకాష్ రాజ్ కు వున్న ప్లస్ పాయింట్లను చెబుతూ అతన్ని గెలిపించామని “మా” సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశాడు . నాగబాబు కూడా గతంలో “మా ” అధ్యక్షుడిగా పనిచేశాడు.

MAA Elections: 'మా' ఎన్నికల ఫలితాల అనంతరం మెగా బ్రదర్​ నాగబాబు సంచలన నిర్ణయం.. ప్రాంతీయవాదం ఉన్న మాలో ఉండలేనంటూ..

మంచు విష్ణు కన్నా ప్రకాష్ రాజ్ సర్వ సమర్థుడని చెప్పినా “మా ” సభ్యులు ప్రాంతీయ తత్త్వం , మన అనే భేద భావం వదిలి పెట్టక పోవడం నాగబాబును మానసికంగా దెబ్బతీసింది . ఇదే సమయంలో విష్ణు గెలుపు తన గెలుపుగా నరేష్ సంబరాలు చేసుకున్నాడు . .

ప్రకాష్ రాజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి మద్దతు పరోక్షంగా ఇచ్చినా ప్రత్యక్షంగా మద్దతు తెలిపి అతని విజయం కోసం శక్తి యుక్తులను ఉపయోగించినవాడు నాగబాబు . అందుకే ప్రకాష్ రాజ్ ఈ ఓటమిని అంగీకరించి విష్ణును కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపినా నాగబాబు మాత్రం ఈ ఓటమి తన ఓటమిగా భావించాడు . అందుకే “మా “కు గుడ్ బై చెప్పాడు .

Related posts