telugu navyamedia
సినిమా వార్తలు

పుట్టిన రోజు నాడే విషాదం : సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటులు బాలయ్య గారు(94) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో బాలయ్య తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజు నాడు ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు.

Tollywood Movie Actor Mannava Balayya Biography, News, Photos, Videos | NETTV4U

గుంటూరు జిల్లా వైకుంఠపురం(అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించారు బాలయ్య. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు.మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించారు. 

1958లో నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు బాలయ్య. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము – శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు.

దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు తెరకెక్కించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు.

నందమూరి బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ సినిమా నటుడిగా ఎమ్. బాలయ్యకు చివరి సినిమా. అందులో వసిష్ఠుని పాత్రలో కనిపించారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

Mannava Balayya – Popular character of Telugu cinema since late 1950s – My Words & Thoughts

బాలయ్య మరణావార్త తెలిసిన సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. బాలయ్య గారు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు..

Related posts