యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం “సీత”. తేజ దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 24న విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా”షూటింగ్ సమయంలో హీరో శ్రీనివాస్‌ను బాగా టజ్ చేస్తూ.. బాగా డామినేట్ చేశారట కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ ‘‘(నవ్వుతూ..) లేదండి.. నేనేం టీజ్ చేయలేదు. టీజ్ చేశానని, డామినేట్ చేశానని మీకు ఎవరు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఎలా, ఎవరు పుట్టిస్తారో నాకు తెలియదు కానీ… నేనెప్పుడూ ఎవరినీ టీజ్ చేయలేదండి. నేను కేవలం అబ్జర్వ్ చేస్తానంతే. కావాలంటే షూట్‌లో తేజగారు ఉన్నారుగా.. మీరే అడిగి తెలుసుకోండి..’’ అని అన్నారు.
previous post