telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఫీషియల్ ” “మజిలీ” దర్శకుడితో రౌడీ హీరో

VD12

యంగ్ సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం “వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్” అనే రొమాంటిక్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ .. పూరీజగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో “ఫైటర్” అనే చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న బేన‌ర్‌లో నిర్మిత‌మ‌య్యే సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు మేకర్స్. విజ‌య్ దేవ‌రకొండ 12వ చిత్రాన్ని మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ నిర్మాణ తెర‌కెక్కించ‌నుండ‌గా, రాజు- శిరీష్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ సినిమా పట్టాలెక్కబోతోంది. శివ నిర్వాణ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా `టక్ జగదీష్` సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Related posts