telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్” ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కల్పిక గణేశ్

Kalpika

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 సంద‌డి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది. సెప్టెంబ‌ర్ 6న సాయంత్రం 6 గంట‌ల‌కు బిగ్ బాస్ షో ప్రసారం కానున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. బిగ్ బాస్-4లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప‌లువురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి దీనికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ షోలో సినీనటి కల్పిక గణేశ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అంతా సిద్ధం చేసుకొని 16మంది కంటెస్టెంట్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు బిగ్ బాస్ టీమ్.

Related posts