telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరో విల్‌ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం..

ఆస్కార్‌ అవార్డు గ్రహిత, హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్‌ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. విల్ స్మిత్ పై పదేళ్లు నిషేదం విధిస్తూ ఆస్కార్ కమిటీ నిర్ణయించింది.

94వ ఆస్కార్ – 2022 వేడుకల్లో క్రిస్ రాక్‌ను వేదికపైనే చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ నటుడు, స్టార్ హీరో.. విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ఇది ఒక్క ఆస్కార్‌ అవార్డులకు మత్రమే కాదు ..మోషన్‌ పిక్చర్‌ నిర్వహించే  ఏ కార్యక్రమంలోనూ స్మిత్ హాజరుకాకుండా నిషేధం విధిస్తూ అకాడమీ గవర్నర్ల బోర్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 

కాగా..విల్‌ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్‌ స్మిత్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు..

Related posts