telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటుడు చంద్రమోహన్ కు.. జాతీయ పురస్కారం..

chandramohan got balasubramanyam award

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో అందిస్తున్న జాతీయ పురస్కారానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్‌.. ఎంపికయ్యారు. తన పేరుతో అందిస్తున్న పురస్కారానికి ఈ ఏడాదికి గాను చంద్రమోహన్ ఎంపికైనట్టు బాలసుబ్రహ్మణ్యం మంగళవారం స్వయంగా వెల్లడించారు.

వచ్చే నెల 4న తన జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని టౌన్ హాల్‌లో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అలాగే, సామాజిక సేవను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మరో అవార్డును ఇవ్వబోతున్నట్టు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts