telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా పై కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు…

“కరోనా” నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ.

• డిసెంబర్ 1 నుంచి 31 వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలిపిన కేంద్ర హోంశాఖ.

• “కంటైన్​మెంట్ జోన్ల” ఆవల ఆంక్షలు విధించాలని అనుకుంటే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని స్పష్టం.

• కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సూక్ష్మ స్థాయిలో “కంటైన్​మెంట్ జోన్ల”ను ఏర్పాటు చేయాలి.

• “కంటైన్​మెంట్ జోన్ల” వివరాలను జిల్లా కలెక్టర్​లు వెబ్​సైట్లలో పొందుపర్చాలి.

• ఆ సమాచారాన్ని కేంద్ర వైద్య శాఖకు అందించాలి.

• రోజువారీ అవసరాలు మినహా “కంటైన్​మెంట్ జోన్ల”లో ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి.

• కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలి.

• పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు “క్వారంటైన్​“లో ఉంచాలి.

• జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు “కరోనా” నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షించాలి.

• ఆయా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంచాలి.

• ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.

• మాస్కులు ధరించనివారికి జరిమానాలు విధించే అవకాశాన్ని రాష్ట్రాలు పరిశీలించాలి.

• “కరోనా” నిర్వహణకు జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలను పాటించాలి.

• అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్ హాళ్లపై నిషేధం కొనసాగుతాయని స్పష్టం.

• సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కొనసాగింపు.

• వీటిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడించిన కేంద్ర హోంశాఖ.

Related posts