telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సూపర్‌ స్టార్‌ రజనీ కొత్త పార్టీ… ప్రజలు మొగ్గు చూపుతారా

Rajinikanth actor

ఎట్టకేలకు కష్టపడినప్పటికీ దక్షిణ భారత సూపర్‌ డూపర్‌ స్టార్‌ రజని కాంత్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు.కాని బొమ్మ పడాలంటే ఈ ఏడాది చివర వరకు ఆగాల్సిందే. ఏమైతే ఏం ఇప్పటి దాకా కొన సాగిన వూగిసలాట ముగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే పదిమే అంటున్నారు అభిమానులు. భాషా సినిమాలో రజనీకాంత్‌ నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటుంటాడు గాని నిజ జీవితంలో వందసార్లు చెప్పినా నిర్ణయానికి రావడానికి ఇంతకాలం పట్టింది, ఈ లోగా చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌తో కమల్‌హాసన్‌తో సహా చాలా మంది రాజకీయాలో ప్రవేశించడం రాకరాని అనుభవాన్ని పొందడం జరిగిపోయింది. 1996లోనే జయలలితను ఓడించేందుకు పులుపునిచ్చి కరుణానిధి విజయానికి దోహదం చేసిన రజనీకాంత్‌ తనంతట తానుగా రంగ ప్రవేశం చేయడానికి ఇంత కాలం పట్టిందంటే అది వ్యక్తిగత సంకోచాన్ని మాత్రమే గాక తమిళ రాజకీయ సంక్లిష్టతను కూడా చెబుతోంది. రజనీ మక్కల్‌ మండ్రం పేరిట వెసిన అభిమాన సంఘాలతో రెండు మూడు సంవత్సరాలుగా సంప్రదింపులు జరుపుతున్న రజనీకాంత్‌ ఎంతో కొంత పునాది వేసుకునే ఉంటారు.నటుడిగా వుండే అభిమానాలు ఎలాగూవుంటాయి. అయితే ఆయన రాజకీయ విధానం ఏమిటి ఒకడిగా విడిగా పోటీ చేస్తారా ఇజెపితో కలిసి వెళనున్నారా అన్నది ఎక్కువ మంది ఆలోచిస్తున్న అంశం.ఇంత వరకూ ఎవరూ వెళ్లని విధంగా ఆధ్యాత్మిక రాజకీయం అన్న మాట వాడటం కూడా సందేహాలను పెంచుతోంది. ఇది బిజెపితో కలవడానికి పాడుతున్నారా లేక ఎదుర్కొవడానికా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.

ఆధ్మాత్మికం అంటేనే లౌకిక వ్యవహారానికి సంబంధం లేని దని మన దేశంలో భావిస్తారు. కాని హిందూత్వ రాజకీయాన్ని తెచ్చిన బీజేపీ మతాన్ని కలగాపుగం చేసింది. అయితే తమిళనాడులో మొదటి నుంచి హేతువాడ ఉద్యమం బ్రాహ్మణేతర ఉద్యమం బంగా వేళ్లూనికొని వున్నాయి. బిజెపి అడుగుమోపలేకపోగా అరవయ్యివ దశకం తర్వాత కాంగ్రెస్‌ కూడా జూనియర్‌గానే వుండిపోయింది. తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వం లోని డిఎంకె దాని నుంచి చీలి పోయి మొదట ఎంజిఆర్‌ తర్వాత జ్లయలిత నాయకత్వంలోనడుస్తున్న అన్నా డిఎంకెలే తమిళరాజకీయాలను శాసిస్తున్నాయి. హిందీ, హిందూ, హిందుస్తాన్‌ అన్న నాటి జన సంఘం నేటి బీజేపీ రాజకీయాలు అక్కడ ప్రవేశించలేకపోయాయి. అయితే జయలిత హయాంలో ద్రవిడ భావజాం తగ్గుముకం పట్టిన మాట నిజం, ఆమె మరణానికి రజనీకాంతో ఉద్వేగంగా స్పందించిన మాటా నిజం. అదే సమయంలో అన్నా డిఎంకె పార్టీపై ఆయన అప్పట్లో అస్త్రాలను ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం ప్రశంసిస్తూ వచ్చారు,వాస్తవానికి ఆయన బిజెపిలో చేరతారనే జోస్యాతో సహా చాలామంది చెప్పారు. కాని వ్యక్తిగత ఆకర్షణ పునాదిగా అలాంటివ్యక్తి బిజెపి లాంటి పార్టీలో వ్యవస్థాగత చట్రంలో ఇమడటం తేలికకాదు. ఈ లోగా తన సమకాలీకుడు తర్వాతి వాడైన కమల్‌హాసన్‌ మక్కల్‌నీతిమగం పార్టీని స్తాపించి కొంతవరకూ బిజెపి పట్ల విమర్శనాత్మక వైఖరి తీసుకున్నారు.మరోవైపున గురుమూర్తి ద్వారా రజనీతో మంతనాలు జరిపిన బిజెపి అన్నాడింఎకెతో పొత్తు చేసుకునేందుకు అడుగు వేసింది. ఇటీవల హోంమంత్రి అమిత్‌షా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ఫళనిస్వామి బిజెపితో పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. ఇవన్నీ చాలక మన్నార్‌గుడి మాఫియాగా పేరొందిన శశికళ జైలు నుంచి రాబోతున్నారు. కరుణానిధి మరణంతో మొదటిసారి పూర్తి నిర్ణయాధికారం చేతికొచ్చిన స్టాలిన్‌ డిఎంకెను ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలని నానా వ్యూహాలు పన్నుతున్నారు.
రజనీ నిర్ణయం తీసుకుంటున్న సందర్భం ఇది. అయితే ఇంకా పూర్తి వివరాలు చెప్పి ఆచరణలోకి దిగేంతవరకూ వేచిచూడవలసిందే. ఆరోగ్యం బాగాలేదన్న మాట ఒకటి వుంది. తను ముఖ్యమంత్రి పదవిచేపట్టబోనని కూడా ఆయన ప్రకటించివున్నారు. అంటేమరెవరినైనా బలపరుస్తారా లేక చేతులు కలుపొ అప్పుడా కూటమికి నాయకుడుగా ఉంటారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. తానే నాయకత్వం వహిస్తానంటే తప్ప ప్రజలు విశ్వసించబోరనే అభిప్రాయం బాగా వుంది. కమల్‌హాసన్‌ కూడా తన వంతుగా కుస్తీ చేస్తూ వున్నారు. రజనీకాంత్‌ శశికళ మధ్య పోటీ అని సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. పైకి చెప్పని ఎన్నొ అంశాలు రజనీకాంత్‌పై ప్రభావం చూపుతున్న మాట నిజం. వాటికి నూతన సంవత్సరం జవాబు చెప్పాలి. తర్వాత ఎన్నికలకు ఎన్టీఆర్‌ వున్నట్టు తొమ్మిది నెలల సమయంకూడా లేదు. ఎన్టీఆర్‌తో ఆగిపోయిన తారాధినేత సంచరాన్ని రజనీకాంత్‌ ఏం చేస్తారో చూడాలి,దేనికైనా ప్రజామోదం కీలకం.

Related posts